శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (17:50 IST)

సీ ఫుడ్ స్పెషల్: స్పైసీ ఫిష్ టిక్కా

కావలసిన పదార్థాలు :
 
కొరమీను చేపలు - 250 గ్రాములు
పెరుగు - 100 గ్రాములు
నిమ్మకాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు
ఆవ నూనె - రెండు టీ స్పూన్లు
ఆవ పొడి - ఒక టీ స్పూన్
వాము - ఒక టీ స్పూన్
పండుమిర్చి పేస్ట్ - రెండు టీ స్పూన్లు
శనగపిండి - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - అర టీ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
చికెన్ బ్రోతి పౌడర్ - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
 
తయారుచేయండి ఇలా : మొదట చేపలను శుభ్రపరిచి కావలసిన సైజుల్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవ నూనె, ఉప్పు, ఆవ పొడి, పండు మిర్చి పేస్ట్, వాము, శనగ పిండి, గరం మసాలా, జీలకర్ర పొడి, చికెన్ బ్రోత్ పౌడర్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత పాన్‌లో నూనె వేసి చేప ముక్కలను రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే స్పైసీ ఫిష్ టిక్కా రెడీ. దీనిని పుదీనా చట్నీతో తింటే భలే రుచిగా ఉంటుంది.