శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2014 (17:00 IST)

రుచికరమైన బట్టర్ గార్లిక్ ఫిష్ ఫ్రై

కావల్సిన పదార్థాలు: 
చేప ముక్కలు - అర కేజీ
మైదా పిండి - ఒక టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
వెన్న - 2 టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి, కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత 
 
తయారుచేయు ఇలా : మొదట వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ ను ఒక బోలు గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి జారుడుగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు అలాగే నాననివ్వాలి. సుమారు అర గంట నుండి ఒక గంట సేపు అప్పుడప్పుడూ కలుపుతూ అలాగే పక్కనుంచాలి. తర్వాత నాన్ స్టిక్ పాన్ లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో మసాలాలో నానబెట్టిన చేపముక్కలను వేసి అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని, తీసివేయాలి. అంతే రుచికరమైన బట్టర్ (వెన్న) గార్లిక్ ఫిష్ ఫ్రై రెడీ. సైడ్ డిష్‌ గానూ తీసుకుకోవచ్చు. లేదా ఈవెనింగ్ స్నాక్స్ గా కూడా ఆరగించవచ్చు.