శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (16:30 IST)

వీకెండ్ స్పెషల్ : చికెన్ బటర్ మసాలా!

చికెన్ బటర్ మసాలా అంటేనే పిల్లలు సైతం ఇష్టపడి తింటారు. ఎందుకంటే ఇందులో స్పైసీ తక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుచేత ఈ వీకెంట్ మటన్ పులావ్, వెజ్ పలావ్, బిర్యానీ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా రోటీలకు సైడిష్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే చికెన్ బటర్ మసాలా చేసేయండి. 
 
ఎలా చేయాలి?
కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ - అరకేజీ  
బటర్ - వంద గ్రాములు 
టమోటా గుజ్జు - ఒక కప్పు
ప్రెష్ క్రీమ్  - ఒక కప్పు 
కారం పొడి - ఒక కప్పు 
పసుపు పొడి - ఒక టేబుల్ స్పూన్
కస్తూరి మేతి - నాలుగు టీ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు  
ఉప్పు- నూనె- తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు సన్నని సెగపై ఐదు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. చికెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత అందులో బటర్ చేర్చుకోవాలి. టమోట్ గుజ్జును కూడా చేర్చి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. 
 
ఇందులో కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి వేయిస్తూ ఉండాలి. ఈ మిశ్రమంలో కస్తూరి మేతి చిన్న ముక్కలుగా కట్ చేసి చిలకరించుకోవాలి. చివరిగా తాజా క్రీమ్‌ను కూడా చేర్చి పది నిమిషాల పాటు ఉడికించాలి. అంతే చికెన్ బటర్ మసాలా రెడీ. దీనిని వైట్ రైస్‌, బిర్యానీ, రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.