శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (16:13 IST)

లండన్‌లో ఎంపీ కవితకి ఘన స్వాగతం... ఎందుకో తెలుసా?

లండన్‌లో జరుగనున్న కామన్‌వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్(CWP) సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత గారిని తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డం శాఖ సభ్యులు మరియు కెసిఆర్ మరియు

లండన్‌లో జరుగనున్న కామన్‌వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్(CWP) సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత గారిని తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డం శాఖ సభ్యులు మరియు కెసిఆర్ మరియు తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే- - కే.టీ.ఎస్.యూకే ఆధ్వర్యంలో (KCR & TRS supporters of UK) సభ్యులు హీత్రూ విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానించారు.
 
మన తెలంగాణ ఆడబిడ్డ అయిన కవితక్క ఈ సదస్సులో పాల్గొనడం మన రాష్ట్రానికి అరుదైన గౌరవం అని కేసిర్ తెరాస మద్దతుదారుల సంఘం అధ్యక్షులు సిక్కాచంద్ర శేఖర్ గౌడ్ గారు పేర్కొన్నారు. కవిత గారికి స్వాగతం పలికిన వారిలో నగేష్ కాసర్ల, నరేష్ కుమార్, వెంకట్ రంగు, భాస్కర్ మొట్ట, సురేష్ గోపతి, సునీల్ ముపల, రాజేష్ ఎనపోతుల వున్నారు.
 
శ్రీమతి కవిత గారు CWP స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా పాల్గొంటున్న ఈ సదస్సులో కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్సును ప్రోత్సహించడం మరియు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడంపై చర్చిస్తారు. లింగ పరమైన వివక్ష లేకుండా మహిళల అభ్యున్నతి కోసం, రాజకీయ సాధికారత కోసం అవసరమైన విద్య, సమాచార మార్పిడి తదితర విషయాలపై సమావేశంలో చర్చిస్తారు.
 
కామన్వెల్త్ దేశాల పార్లమెంటులలో మహిళలు- సవాళ్లు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపు - చర్యలు, దేశాల వారీగా మహిళల సమస్యలు, మహిళా పాలసీ రూపకల్పన తదితర అంశాలపై సెమినార్లు ఉంటాయి. ఈ నెల 24 నుండి 27 వరకు సదస్సు నిర్వహించబడుతుంది.