Widgets Magazine

చికాగో సెక్స్ స్కామ్ : తెలుగు నిర్మాత అరెస్టు.. ఖాకీలకు ఉప్పందించిన హీరోయిన్

అమెరికాలోని చికాగో వెలుగు చూసిన సెక్స్ స్కామ్‌లో తెలుగులో చిన్నచిన్న చిత్రాలు నిర్మించే నిర్మాత కిషన్ మొదుగుమూడి అలియాస్ శ్రీరాజు చెన్నుపాటి, ఆయన భార్య అరెస్టు అయ్యారు. ఈ స్కామ్ గురించి ఓ హీరోయిన్ చిక

prostitution
pnr| Last Updated: గురువారం, 14 జూన్ 2018 (19:23 IST)
అమెరికాలోని చికాగో వెలుగు చూసిన సెక్స్ స్కామ్‌లో తెలుగులో చిన్నచిన్న చిత్రాలు నిర్మించే నిర్మాత కిషన్ మొదుగుమూడి అలియాస్ శ్రీరాజు చెన్నుపాటి, ఆయన భార్య అరెస్టు అయ్యారు. ఈ స్కామ్ గురించి ఓ హీరోయిన్ చికాగో పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చింది. దీంతో ఈ వ్యభిచారం గుట్టుబట్టబయలైంది. అయితే, ఈ హీరోయిన్ ఎవరన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
నిజానికి చికాగోలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ తెలుగు సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అమెరికాలోని తెలుగువాళ్లు అవాక్కయ్యారు. కొన్నేళ్లుగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతోంది. ఈ స్కామ్ వివరాలను పరిశీలిస్తే, తెలుగు ఎన్నారైలలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి కిషన్ మొదుగుమూడి అలియాస్ శ్రీరాజు చెన్నుపాటి. ఈయన అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఎంతో పాపులర్ అయిన కిషన్.. అమెరికాలో ఉండే తెలుగులో చిన్నచిన్న సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. చికాగోలోని వెస్ట్ బెల్డన్ ఏరియాలో 5700 నెంబర్‌లోని రెండు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. 
 
అయితే, కిషన్ తెలుగు హీరోయిన్స్‌, యాంకర్స్‌, క్యారెక్టర్ ఆర్టిస్టులను సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ పేరుతో తాత్కాలిక వీసాతో అమెరికా తీసుకెళ్లి ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. వీరికి ఖ‌రీదైన హోటల్స్‌లో బస సౌకర్యం ఏర్పాటు చేస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత.. వారికి డబ్బు ఆశ చూపి.. వ్యభిచార రొంపిలోకి దించేందుకు మభ్యపెడుతాడు. ఇందుకోసం తన అపార్ట్‌మెంట్‌తోపాటు, ఖరీదైన హాటల్స్‌ను ఎంచుకునేవాడు. 
 
ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో నటించే ఓ చిన్న నటి ఇటీవల అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇచ్చేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కిషన్ ప్రోత్సహించగా, ఆమె అందుకు వ్యతిరేకించింది. పైగా, ఆ నటి చికాగో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగడంతో గుట్టు మొత్తం రట్టయ్యింది. నిందితుడు కిషన్‌తోపాటు ఆయన భార్య చంద్ర కూడా భాగస్వామ్యం అయినట్లు గుర్తించారు. 
 
ఈ చీకటి వ్యవహారాలకు సంబంధించి చిట్టా కూడా రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏ నటి ఎన్నిసార్లు అమెరికా వచ్చింది.. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలను చంద్ర దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. ఒక్కో డీల్‌కు 3 వేల అమెరికా డాలర్లు వసూలు చేసినట్లు చిట్టా లెక్కలు చెబుతున్నాయి. 
 
మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుందని.. ఇప్పటివరకు ఎంత డబ్బు చేతులు మారింది.. ఎంత మంది పాత్ర ఉంది అనేది విచారణ చేస్తున్నారు. ఇంట్లో చేసిన సోదాల్లో బ్యాగుల్లో 70 కండోమ్స్, మొబైల్ ఫోన్లు, ల్యాబ్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 42 పేజీల చార్జిషీట్‌ను చికాగో జిల్లా కోర్టుకు సమర్పించారు. ఈ ఘటన ఇపుడు తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 


దీనిపై మరింత చదవండి :