మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (15:19 IST)

తిరుమల వెంకన్నకు ఏడు వత్తులతో ఇలా దీపమెలిగిస్తే..?

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు.. భక్తుల కొంగుబంగారం. కోరిన కోరికలను నెరవేర్చే తిరుమల వెంకన్న స్వామిని శనివారం ఇలా ప్రార్థించాలి. ఎలాగంటే? శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. ఇంటిల్లపాదిని శు

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు.. భక్తుల కొంగుబంగారం. కోరిన కోరికలను నెరవేర్చే తిరుమల వెంకన్న స్వామిని శనివారం ఇలా ప్రార్థించాలి. ఎలాగంటే? శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. ఆపై శుచిగా స్నానమాచరించి.. దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. వెంకన్న స్వామి పటానికి పసుపుకుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి. ఆపై సంకల్పం చెప్పుకోవాలి. 
 
ముందుగా బియ్యంపిండి, పాలు, ఒక చిన్న ముక్క బెల్లం, అరటిపండు వేసి కలిపి చపాతీలాగా చేసి దానిలో ప్రమిదలా చేయాలి. అంటే బియ్యంపిండితో ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకన్న స్వామిని ముందు వెలిగించాలి. నేతితో లేదా నువ్వుల నూనెను ఉపయోగించి దీపారాధన చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా కర్పూరం వెలిగించి.. ఆ వెలుగులో దీపారాధన చేయాలి. అలాగే విష్ణుసహస్ర నామంతో స్వామి వారిని స్తుతించాలి. 
 
ఇలా ఎనిమిది శనివారాలు వెంకన్నకు ఇలా బియ్యంపిండితో దీపమెలిగిస్తే.. దోషాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే శనీశ్వరుడి వల్ల కలిగే బాధలన్నీ తొలగిపోవాలంటే శనివారం పూట శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు.