శుక్రవారం రాశిఫలితాలు : ఓర్పు.. లౌక్యం అవసరం...

శుక్రవారం, 12 జనవరి 2018 (08:24 IST)

daily astro

మేషం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక వాయిదా పడుతుంది. యాదృచ్ఛికంగానే దుబారా ఖర్చులుంటాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు.  
 
వృషభం : వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత అవసరం. ఇతరులకు సలహాలు ఇచ్చి మీరు సమస్యలు తెచ్చుకుంటారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. 
 
మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలను పొందుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
కర్కాటకం: వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. అనుకోకుండా అవకాశాలను పొందుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవానుగ్రహం లేదని మాత్రం నిరాశపడవద్దు. మిత్రులతో ఏర్పడిన వివాదాలన పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త వలన ఆనందం కలుగుతుంది. 
 
సింహం: చిరకాల ప్రత్యర్థులు మీ పట్ల విధేయత ప్రదర్శిస్తారు. మీ ప్రయోజనాలను పరీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలను పొందుతారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో నిర్లక్ష్యం తగదు. కాంట్రాక్టులు అధిక శ్రమాంతరం పూర్తి చేస్తారు. 
 
కన్య: ఏ విధంగానైనా,  ఎక్కడున్నా మీదే పైచేయి అని నిరూపించుకుంటారు. కీలక సమాచారం అందుకుంటారు. వాహనం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
తుల: ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు వీలు లేకుండా పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. మీ ఉన్నతిని చాటుకోవడం ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. పారిశ్రామిక రంగంలోని వారికి విద్యుత్ కోత, కార్మిక సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. హామీలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త.
 
ధనస్సు: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తలవల్ల ఇబ్బందులు తప్పవు. ఏకాగ్రత, పట్టుదలతో శ్రమించిన అనుకున్న లక్ష్యాలు సాధించగలరు.
 
మకరం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించుకోవాల్సి వస్తుంది.
 
కుంభం : విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్, కార్మిక సమస్యలు తలెత్తుతాయి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. 
 
మీనం: అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక విందు భోజనం, ప్రయాణం వంటి పరిణామాలున్నాయి.దీనిపై మరింత చదవండి :  
January 12 Daily Predictions Today Astrology Daily Horoscope

Loading comments ...

భవిష్యవాణి

news

గురువారం దినఫలాలు... నిరంతర కృషితోనే విజయం...

మేషం: ఏకాంతం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. స్త్రీల ...

news

జనవరి 10, 2018 మీ రాశి ఫలితాలు ఇలా వున్నాయి

మేషం : దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గతం కంటే పరిస్థితి కొంత ...

news

మంగళవారం దినఫలాలు - మానసిక ప్రశాంతత చేకూరుతుంది

మేషం : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాటం పెట్టే అవకాశం ఉంది. ఆలయ సందర్శనాలలో చురుకుగా ...

news

సోమవారం దినఫలాలు .. మీ పురోభివృద్ధి మీ చేతుల్లోనే

మేషం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు ...