శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

27-04-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జునుడిని ఆరాధించినా...

మేషం : కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉఁది. ప్రేమికుల తొందరపాటుతనం అనర్థాలకు దారితీస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. రావలసిన ధనం వసూలు కాకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. దైవకార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
మిథునం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. 
 
కర్కాటకం : చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. సమయానికి సహకరించని మిత్రుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, ఇతరాత్రా చికాకులు అధికంగా ఉంటాయి. 
 
సింహం : ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దైవ, పుణ్య సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఏసీ, కూలర్, ఇన్వర్టర్ల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు నడుము, నరాలకు, ఎముకులకు సంబంధించిన చికాకులు ఎదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
కన్య : వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 
 
తుల : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడాతాయి. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. 
 
వృశ్చికం : స్థిరాస్తి క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. 
 
ధనస్సు : బ్యాంకిగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు, ఆహారం విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. 
 
మకరం : కొత్తగా ప్రారంభించిన వ్యాపారాల్లో దినదినాభివృద్ధి చెందుతారు. అదనపు ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. రాజకీయ నాయకులకు విజయం వరిస్తుంది. ఆఫీసుల్లో తొందరపాటు నిర్ణయాలతోకాక, మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకుసాగండి. 
 
కుంభం : ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. విలాస జీవితాన్ని గడుపుతారు. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇంటా, బయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
మీనం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహంలో మార్పులకు, చేర్పులు వాయిదాపడతాయి. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ముందుగా ఊహించనవి కావడంతో ఇబ్బందులు తలెత్తవు.