మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 28 డిశెంబరు 2017 (12:40 IST)

మిథున రాశి వారి ఫలితాలు, 2018లో ఇలా వున్నాయి

మిథున రాశి: మృగశిర 3, 4 పాదములు (కా,కి) ఆరుద్ర 1, 2, 3,4 పాదాలు (కూ, ఖం, జ్ఞ, చ్ఛ), పునర్వసు 1, 2, 3 పాదాలు (కే, కో, హా). ఆదాయం-14, వ్యయం-2, పూజ్యత-4, అమానం-3. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా ధనస్థానము నందు రాహువు, అష్టమ స్థానము నందు కేతువు, అక్టోబర్

మిథున రాశి: మృగశిర 3, 4 పాదములు (కా,కి) ఆరుద్ర 1, 2, 3,4 పాదాలు (కూ, ఖం, జ్ఞ, చ్ఛ), పునర్వసు 1, 2, 3 పాదాలు (కే, కో, హా).  ఆదాయం-14, వ్యయం-2, పూజ్యత-4, అమానం-3. 
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా ధనస్థానము నందు రాహువు, అష్టమ స్థానము నందు కేతువు, అక్టోబర్ 11వ తేదీ వరకు పంచమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు, ఈ సంవత్సరం అంతా సప్తమము నందు శని సంచరిస్తాడు.
 
ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా ''అరక్షితం తిష్ఠతి దైవ రక్షితం'' భగవంతుని కృప మీకు ఉన్నందువల్ల అధిక శ్రమానంతరం సత్ఫలితాలు పొందుతారు. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సప్తమ శని సంచారం వల్ల అనారోగ్యం, బాధలు ప్రతి పనిలో జాప్యం, వృధాగా ధనవ్యయం, విదేశీయానం పట్ల ఆసక్తి పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో అక్టోబర్ వరకు ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికమైన ఇబ్బంది ఉండదు. అనవసర ఖర్చులు అధికముగా ఉంటాయి. మీకు రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది.
 
ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగస్తులకు పనులు ఆలస్యం అవుతాయి. ఇతరుల మీద ఆధారపడకుండా ఏ పనైనా స్వయంగా చూసుకోవడం ఉత్తమం. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక కృషి చేసిన సఫలీకృతులౌతారు. వృత్తి వ్యాపారులకు నూతన పెట్టుబడులు, నిర్ణయాలు, లావాదేవీలు, రుణాలు ఏ విధంగా చూసుకున్న కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. అయితే నష్టం కలిగే సూచనమాత్రం లేదు. జూలై, ఆగస్టు నెలల్లో సత్ఫలితాలు పొందుతారు. 
 
వ్యవసాయ రంగాల్లో వారికి శ్రమ, అధిక ధనవ్యయం, ఆందోళన తప్పవు. అనుకున్న రాబడికంటే తక్కువే పొందుతారు. విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత, పట్టుదలతో శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించదు. ఎముకలు, కాళ్ళు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. రాజకీయాల్లో వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి పదవులు పొందగలుగుతారు. నిర్మాణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తవుతాయి. 
 
అక్టోబర్ వరకు పుణ్య కార్యాలు, శుభకార్యక్రమాలందు పాల్గొంటారు. అంతేగాకుండా మీకు సంబంధం ఉన్నా లేకున్ నా ప్రతివారి పనిలోనూ దృష్టి కేంద్రీకరించి సహకారం చేస్తూ ఉంటారు. స్థిరమైన ఆలోచనలతో విజయాన్ని మీ సొంతం చేసుకోండి. కుటుంబ సౌఖ్యం కొంత తక్కువనే చెప్పవచ్చు. మీ మాట, తీరు ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సంతానం అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది. కిరణా, ఫ్యాన్సీ, వస్త్ర రంగాల్లో వారు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. పెట్టుబడులపై ఆసక్తి నెలకొంటుంది. 
 
అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయమవుతాయి. వారిలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. కళా, క్రీడారంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. ఇతరులకు సాయం చేసి మాటపడవలసి వస్తుంది. పండితులకు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారు విశిష్టమైన పురస్కారాలు అందుకుంటారు. 
 
ఆడిటర్లకు, వైద్య రంగాల్లో వారికి ఒత్తిడ అధికమైన తగిన ప్రతిఫలం పొందుతారు. ముఖ్యుల రాకపోకలు ఆనందం కలిగిస్తాయి. హోటల్, కేటరింగ్, బేకరి రంగాల్లో వారికి పురోభివృద్ధి. షేర్ మార్కెట్ రంగాల్లో వారికి లాభదాయకంగా వుండగలదు. సంగీత, సాహిత్య, సినీ రంగాల్లో వారికి ప్రముఖుల నుంచి ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంది. విదేశీయాన యత్నాలు, విదేశీ చదువుల్లో సఫలీకృతులు కాగలవు. 
 
* ఈ రాశివారు లక్ష్మీగణపతిని పచ్చని పూలతో పూజించడం వల్ల సర్వదా అభివృద్ధి కానవస్తుంది. 
* మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వార ఎర్ర గోమేధికం పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేక వైక్రాంతమణి అనే రాయిని ధరించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
* మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు, ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును, పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది.