శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (11:22 IST)

''నీలం శంఖం'' పువ్వులతో శనిదేవుని పూజిస్తే?

శని దేవుని పేరు వినగానే సహజంగా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతుంటారు. ఆరోగ్య

శని దేవుని పేరు వినగానే సహజంగా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతుంటారు. ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను సమస్యలను సృష్టిస్తూ సతమతం చేస్తుంటారు.
 
కష్టనష్టాలను కలిగిస్తూ సమయానికి ఎవరి సహాయం అందకుండా చేస్తారు. అలాంటి శనిదేవుని శాంతిపజేయడానికి అనేక మార్గాలు గలవు. వాటిలో ఒకటిగా నీలం శంఖం పూలతో శనీశ్వరుని పూజించాలి. దేవతలకేకాకుండా గ్రహాలకు కూడా కొన్ని రకాల పువ్వులు ప్రీతికరమైనవిగా చెబుతున్నారు.

దేవతలకు ఇష్టమైన పువ్వులతో పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా నీలం శంఖం పువ్వులతో అనునిత్యం ఆ స్వామిని పూజించాలి. ఈ విధంగా శనీశ్వరునికి పూజలు చేయడం వలన శాంతిస్తారు. తద్వారా ఆ స్వామి అనుగ్రహంతో శనిదోషాలు తొలగిపోతాయి.