ఇతరుల చేతుల్లో నుంచి వాటిని తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

మంగళవారం, 26 డిశెంబరు 2017 (16:41 IST)

Sesame

సాధారణంగా ఇతరుల చేతుల్లో నుంచి కొన్ని వస్తువులను తీసుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని మనం తెలిసి తీసుకుంటాం. కొన్ని మనం తెలియక తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల అనేక నష్టాలను, దారిద్రాలను కొనితెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. కాలం మారినా ఇంకా చాలా రకాల నమ్మకాలు, ఆచారాలు ప్రజల్లో అలాగే ఉండిపోయాయి. వాటికి శాస్త్రీయ నిరూపణ ఉండదు కానీ అలా చేయకూడదని పెద్దలు ఇంట్లో చెబుతుంటారు, కానీ చాలామంది వాటిని పట్టించుకోరు. 
 
వంట చేసేటప్పుడు చాలామంది పక్కన ఉన్న వారిని కారం ఇలా తీసుకో అని అడిగి తీసుకుంటారు. అలా అడిగినప్పుడు కారం ఎత్తివ్వకూడదు. నల్ల నువ్వులు, నువ్వుల నూనెలను కూడా ఒకరి చేతిలో నుంచి తీసుకోకూడదు. వాటిని పక్కనబెట్టమని చెప్పి ఆ తరువాత తీసుకోవాలి. నల్ల వంకాయలను కూడా ఇతరుల చేతిలో నుంచి తీసుకోకూడదు. 
 
ఎందుకంటే నల్ల వంకాయలు శనీశ్వరునికి ఇష్టమైనవి కాబట్టి. అలాగే ఇంట్లో నిత్యపూజ, ఏదైనా ప్రత్యేక పూజ చేసేటప్పుడు ఇతరుల చేతిలో నుంచి వస్తువులను తీసుకోకుండా ఏదైనా ఆకుపై పెట్టి ఇవ్వమని చెబితే మంచిది. అలా అందుకుంటే మంచిది. వారి చేతి నుంచి తీసుకుంటే మాత్రం పూజ చేసిన ఫలితం రాకపోగా కష్టాలు దరిచేరుతాయి.
 
నవరత్న ఉంగరాన్ని ఎవరి చేతి నుంచి తీసుకోకూడదు. అలా తీసుకుంటే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే చింతపండు, ఆవాలను కూడా ఇతరుల చేతిలో నుంచి తీసుకోకూడదు.దీనిపై మరింత చదవండి :  
Items Puja Black Brinjal

Loading comments ...

భవిష్యవాణి

news

26-12-2017 మంగళవారం దినఫలాలు.. శ్రీమతి సలహా పాటించండి...

మేషం: విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. మీ విషయాల్లో ఇతరుల ...

news

25-12-2017 సోమవారం.. మీ రాశి ఫలితాలు..

మేషం: ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిప్రాయాలు గుట్టుగా ...

news

24-12-17 ఆదివారం రాశి ఫలితాలు

మేషం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ...

news

24-12-2017 నుంచి 30-12-2017 మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, శని, ...