బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (15:18 IST)

ఎంత హద్దుల్లో ఉంటే.. అంత మర్యాద..?

ఎంత తక్కువ మాట్లాడితే.. అంత విలువ..
ఎంత ఎక్కువ ప్రేమిస్తే.. అంత మనశ్శాంతి..
ఎంత దూరంగా ఉంటే.. అంత గౌరవం..
ఎంత హద్దుల్లో ఉంటే.. అంత మర్యాద..
ఎంత తక్కువ ఆశిస్తే.. అంత ప్రశాంతత..
ఎంత నిగ్రహంతో ఉంటే.. అంత అగ్రస్థానం..
 
మనకు గల శక్తిని బట్టి మనలను మనం అంచనా వేసుకుంటాం..
మనం చేసిన పనులను బట్టి ఇతరులు మనలను అంచనా వేస్తారు..
 
మన ఆలోచనా విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటుంది..
మూడో వ్యక్తి మాటలు ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం..
 
ఏదైనా ఒక విషయాన్ని చూడగానే ఒక నిర్ణయానికి రావడం వివేకవంతుని లక్షణం కాదు..
ఆ విషయాన్ని నిశితంగా పరిశీలించి, అంచనాకు రావడమే మేధావి బాధ్యత..