ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:46 IST)

అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

జగజ్జనని అయిన అమ్మవారి వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప

జగజ్జనని అయిన అమ్మవారి వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి.
 
ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన సిరిసంపదలు చేకూరుతాయి. ఆవునెయ్యితో అభిషేకం చేయడం వలన అనారోగ్యాలు దరిచేరవు. తేనెతో అమ్మవారిని అభిషేకించడం వలన కీర్తి పెరుగుతుంది. పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం వలన సౌభాగ్యం నిలుస్తుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యం పాయసం. 
 
పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన అమ్మవారు ప్రీతిచెందుతారు. తన భక్తుల అవసరాలను గ్రహించి వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తుంది. ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలను, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందువలన అనునిత్యం అమ్మవారిని పూజిస్తూ, సేవిస్తూ, తరిస్తూ ఉండాలి.