సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:56 IST)

ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎలా..?

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
తృణీభూత హేతిం రణోద్వద్విభూతం
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ 
 
ప్రశాంతమైన మైపూత గలవాడు, బంగారు తేజస్సు కల శరీరం కలవాడు, జగత్తుకు భయం కలిగించే శౌర్యం కలవాడు, హిమవత్పర్వతం వంటి ధైర్యం కలవాడు, యుద్ధమునందు సంపాదించిన విజలక్ష్మీ కలవాడు, పవిత్రులైన ఆప్తమిత్రుల కలవాడు, వాయునందనుడు అయిన ఆంజనేయునికి నమస్కారములు అని ప్రార్థించి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి.
 
ఈ రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయాలని 108 సార్లు ప్రదక్షణ చేసినచో వారు ఎల్లప్పుడూ సిరిపందలతో జీవిస్తారు. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు.. తరచు హనుమంతునికి సింధూరాభిషేకం చేయించినచో తప్పక శనిగ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది.