శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (16:33 IST)

ఎంత తీరిక లేకపోయినా.. 20 నిమిషాలు..?

ఎంత తీరిక లేకపోయినా కూడా రోజులో కనీసం 20 నిమిషాలు ప్రకృతి మధ్య గడపండి. దానివల్ల మానసికోల్లాసం పెరుగుతుంది. ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. అంతేకాదు. రోజంతా చురుగ్గానూ పనిచేసే శక్తి శరీరానికి వస్తుంది. 
 
రోజంతా పనిచేయడం మంచి ప్రయత్నమే. అయితే దానిల్ల కొన్నిసార్లు చిరాకు తప్పదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. పనిలో మధ్య మధ్యలో తీరిక చూసుకోవాలి. రోజువారీ పనులను రాసి పెట్టుకోండి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి.
 
ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నిశ్శబ్ధానికి ప్రాధాన్యం ఇవ్వండి. కనీసం కొన్ని నిమిషాలు ఎలాంటి శబ్ధాలు లేకుండా, మీరు మాట్లాడకుండా మౌనంగా గడపేలా చూసుకోండి. ఇలా చేస్తే మానసికోల్లాసం తప్పనిసరి అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.