శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (15:16 IST)

క్రమశిక్షణను అపార్థం చేసుకోకండి!

క్రమశిక్షణ అంటే శిక్షగాను, తిరస్కారంగాను, ఆత్మత్యాగంగాను కొందరు అపార్థం చేసుకుంటారు. ఈ రకమైన భావం వారి అంతరాంతరాలలో గూడుకట్టుకుని వుంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని బాగా క్రమశిక్షణలో పెట్టి ఉంటారు. 
 
అందువల్ల క్రమశిక్షణ అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోలేని వారయ్యారు. అయితే క్రమశిక్షణవల్ల ఆ వ్యక్తి జీవితంలో సరదా కొరవడుతుందన్నది వాస్తవమే. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వల్పకాలిక వినోదాలను ఒక్కోసారి త్యాగం చెయ్యకతప్పదు. కానీ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధంచడం వల్ల కలిగే సంతృప్తి, సంతోషాల ముందు ఆ త్యాగం వెలవెలపోతుంది.
 
క్రమశిక్షణ, విశ్వసనీయత ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. దానికి కారణమేమిటంటే.. క్రమశిక్షణ గల వ్యక్తి తాను చేయవలసి ఉన్న పనులపైన, కాలపరిమితులపైన దృష్టి సారించి నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తాడు. అలాగే క్రమశిక్షణకు విలువనిస్తాడు. అప్పుడే జీవితంలో జయించగలుగుతాడు.