శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (16:33 IST)

అన్నీ మన మంచికే...?

మత్స్యకారుడైన గంగరాజు సహనశీలే కాదు.. దైవ భక్తి గలవాడు కూడా.. రోజూలానే చేపల వేటకు సముద్రం పైకి వెళ్లాడు.. భగవంతుడా! మంచి వేట దక్కెలా చేయి స్వామి.. కుటుంబం ఆకలి తీర్చాలంటూ కోరాడు.. ఉన్నట్టుండి ఏమీటీ పెను తుఫాను... దాంతో పడవ విరిగిపోయి చాలా దూరం నీటిలో కొట్టుకుపోయాడు గంగరాజు. ఆ తరువాత అక్కడేదో ద్వీపం కనిపించింది.. ప్రాణాలు కాపాడుకోవాలంటూ.. వెళ్లాడు. కానీ, ఆ ద్వీపంపై ఏ ప్రాణీ లేదు.. ఎలా బ్రతకడం.. అంటూ దేవుని మీద భారం వేశాడు.
 
ఒంటరి అయినా గంగరాజు కుంగిపోలేదు. దేవుడా.. ఏ రోజుకైనా నేను మా వాళ్లని చేరుకుంటాననే నమ్మకం నాకుంది. నాలో ఆత్మవిశ్వాసం చెదరకుండా చూడు తండ్రీ.. అంటూ మొరపెడతాడు. అలానే చాలా రోజులు శ్రమించి, ఎండకీ వానకీ తట్టుకోవడానికి అక్కడ దొరికిన కట్టెలు.. ఆకులతో ఒక చిన్న గుడిసె కట్టుకోగలిగాడు.. దేవుడా ఈ ద్వీపం నుండి బయటపడగలిగేలా ఏదైనా మార్గం చూపించు.. స్వామి. కొన్ని నెలల తరువాత.. చేపలు పట్టుకోవడం కాల్చుకుని తినడం తప్ప ఇంక చేయడానికి ఏ పనీ లేదు. ఎలాగైనా చిన్న పడవ తయారుచేసుకోవాలి. 
 
ఓరోజు.. పడవకు కావలసిన కట్టెలను పోగేసాడు. కాస్త కడుపు నింపుకుని పని మెుదలుపెట్టాడు. కానీ, ఆ కట్టెలన్ని కాలి పొగగా మారిపోయాయి. అప్పుడు గంగరాజు.. భగవంతుడా.. నేనేం పాపం చేశాను.. కట్టుకున్న చిన్న గూడు, పడవ కోసం కూడబెట్టుకున్న కట్టెల్ని కాల్చి బుగ్గి చేశావు. ఇక బ్రతికి ప్రయోజనం లేదు. మరణం ఒక్కటే మార్గం.. దేవుడా నిన్ను నమ్ముకుని మోసపోయాను.. అంటూ బాధపడుతుంటాడు. దుఃఖిస్తున్న గంగరాజు ఎవరిదో పిలుపు వినిపించి తేరుకుని చూశాడు. ఓహో, ఎవరు నువ్వు.. ఇక్కడేం చేస్తున్నావు.. పొగ మంటలు చూసి మేము ఇక్కడకు వచ్చాం. మానవ సంచారంలేని ఈ ద్వీపంలో నువ్వేం చేస్తున్నావు..
 
చాలా కాలం క్రితం తుఫానులో చిక్కుని ఇక్కడకు చేరానని చెప్పాడు.. వాళ్ళ సాయంతో ఇంటికి చేరుకున్నాడు గంగరాజు. అన్నీ మన మంచికే జరుగుతాయనే విషయాన్ని తెలుసుకున్న గంగరాజు దేవుడిని నిందించినందుకు పశ్చాత్తాపం చెందాడు. ఇందులోని నీతి ఏంటంటే.. ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని మాత్రం నిందించకూడదని అర్థం.