శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 జులై 2018 (16:01 IST)

మానవునికి ఎన్ని జన్మలు ఉన్నాయి? మళ్లీ పుడతాడా?

ఈ సృష్టిలో సకల ప్రాణకోటి అనగా 84 లక్షల జీవరాసుల సమాహారం. అందులో చివరి జన్మ మానవజన్మ. ఇలాంటి మానవ జన్మలో ధర్మ, అర్థ, మోక్ష, కామాలను తగు విధంగా ఆచరిస్తే ఆపై జన్మలంటూ ఉండవని మన పురాణాలు చెపుతున్నాయి. మానవ జన్మ తర్వాత మోక్షమేనట.

ఈ సృష్టిలో సకల ప్రాణకోటి అనగా 84 లక్షల జీవరాసుల సమాహారం. అందులో చివరి జన్మ మానవజన్మ. ఇలాంటి మానవ జన్మలో ధర్మ, అర్థ, మోక్ష, కామాలను తగు విధంగా ఆచరిస్తే ఆపై జన్మలంటూ ఉండవని మన పురాణాలు చెపుతున్నాయి. మానవ జన్మ తర్వాత మోక్షమేనట. 
 
అయితే, ఈ మోక్షాన్ని సంపాదించుకోలేని వారికి మళ్లీ అన్ని సకల జన్మలూ ఎత్తుకుంటూ తిరిగి మానవ జన్మ ఎత్తి అత్మజ్ఞానం పొందాల్సి ఉంది లేదంటే మళ్లీ జన్మలు ఎత్తాల్సిందే. ఇలా జన్మించిన జీవికి తల్లిదండ్రులు, సోదరీసోదరీమణులు, బంధుబంధుత్వాలు అనే బహు బంధాలు ఏర్పడతాయి. 
 
వాస్తవానికి తల్లి గర్భం నుంచి బయటపడేటపుడు ఏ బంధుత్వం మన వెంటరాదు. కానీ, పుట్టుకకు, గిట్టుకకు మధ్య ఉన్న కాలంలోనే ఈ బంధుత్వాలు.. బంధాలు అనేవి ఏర్పడతాయి. దీన్నే జీవితమంటారు. ఈ మధ్యకాలంలో మనిషికి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోర్కెలు, బుద్ధిపూర్వకంగా పుడుతుంటాయి. 
 
వీటితో పాటు పెళ్లి, పిల్లలు, సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుని బతికి ఉన్నంత కాలం కూడబెట్టుకున్నది తన అనుకున్నవారికి వదిలిపెట్టి.. ఖాళీ చేతులతో తిరుగు ప్రయాణమవుతాడు. ఆ సమయంలో మనతో పాటు.. భార్యగానీ, పిల్లలు గానీ, బంధువులు, బంధుత్వాలు ఏవీ కూడా మన వెంట రావు. అందుకే వీటిపై పెద్దగా వ్యామోహాన్ని పెంచుకోరాదని ఆధ్యాత్మిక గురువులు సలహా ఇస్తున్నారు.