గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (11:02 IST)

దేవీ విశ్వరూపం ఎలా ఉంటుందంటే..?

సత్యలోకం శిరస్సు, సూర్యచంద్రులు నేత్రాలు, దిక్కులు చెవులు, వాక్కు వేదాలు, వాయువు ప్రాణం, విశ్వం హృదయం, పృథివి జఘనం, ఆకాశం నాభి, జ్యోతిశ్చక్రం వక్షస్థలం, మహర్లోకం కంఠం, జనోలోకం ముఖం. తపోలోకం నుదురు. ఇంద్రాదులు, బాహువులు, శబ్దం శ్రోత్రేంద్రియం, అశ్వనీ కుమారులు ముక్కోళ్లు, గంధం ఘ్రాణేంద్రియం, అగ్నినోరు, రెభవళ్ళు కను రెప్పలు, బ్రహ్మస్థానం కనుబోమలు, నీరుదౌడ, రసం నాలుక, యముడు దంష్ట్ర, స్నే దంతాలు, మాయాహాసం, పై పెదవి లజ్జ, క్రింది పెదలి లోభం, సముద్రాలు కుక్ష, పర్వతాలు ఎముకలు, వృక్షాలు కేశకపం, నదులు నాడులు, సర్గం క్రీగంటిచూపు, ధర్మమార్గం పృష్టం, ప్రజాపతి ణేఢ్రం, కౌమార యౌవన జరావస్థలు గతులు మేఘాలు రోమాలు, సంధ్యలు పనవాలు, చంద్రుడు మనస్సు, హరి విజ్ఞానం, అళ్వాది జాతులు శ్రోణితలం, అతలాది అతోలోకాలు కటి మొదలు పాద పర్యంతంగల అవయవాలు కాగా..
 
వేయి తలలతో, వేయి కనులతో, వేయి కాళ్ళతో, కోటి సూర్యుల కాంతితో కోటి విద్యుత్తుల మెరుపుతో అగ్ని జ్వాలామాలికలతో గూడిన నాలుకచాచి, కటకటమని దంష్ట్రలు కొరుకుతూ కనుల నుండి నిప్పురవ్వలు రాలగా భీకరంగా ఘోరంగా ఉన్నది ఆ దేవీ విశ్వరూపం.