బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 30 జులై 2018 (14:08 IST)

భగవంతుని పూజలో ఎలాంటి పువ్వులు వాడకూడదో తెలుసా?

భగవంతుని పూజలో పువ్వులు చాలా ప్రధానమైనవి. భక్తులు వివిధ రకాల పువ్వులను సేకరించి పూజలో సమర్పిస్తుంటారు. కొంతమంది పూజల కోసమే మెుక్కలను పెంచుతుంటారు. మరికొంతమంది పూజకోసమనే పువ్వులు బయట కొంటుంటారు. అయితే

భగవంతుని పూజలో పువ్వులు చాలా ప్రధానమైనవి. భక్తులు వివిధ రకాల పువ్వులను సేకరించి పూజలో సమర్పిస్తుంటారు. కొంతమంది పూజల కోసమే మెుక్కలను పెంచుతుంటారు. మరికొంతమంది పూజకోసమనే పువ్వులు బయట కొంటుంటారు. అయితే భగవంతునికి సమర్పించే పువ్వుల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించవలసిందిగా ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
 
దేవునికి సమర్పించే పువ్వులు వాసన లేని పువ్వులుగా, ఘాటైన వాసన కలిగిన పువ్వులు, ముళ్లు కలిగిన పువ్వులు, వాడిపోయిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులు పూజలకు వాడకూడదు. అంతేకాకుండా పరిశుభ్రమైన, పవిత్రమైన ప్రదేశాల్లో లేని పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. అలాగే నేలపై పడిన పువ్వులు, పురుగులు పట్టిన పువ్వులు, పూర్తిగా వికసించిన పువ్వులు, ఎడమ చేత కోసిన పువ్వులు కూడా దేవునికి సమర్పించకూడదు. 
 
మంచి సువాసనలు కలిగిన పవిత్రమైన పువ్వులను మాత్రమే భగవంతుని పూజలో వాడాలని శాస్త్రంలో చెప్పబడుతోంది. పూజలో సమర్పించే పువ్వులను భక్తి శ్రద్ధలతో దేవునికు సమర్పించాలి. ఇలా చేయడం వలన భగవంతుని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో స్పష్టం చేయబడుతోంది.