1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (12:17 IST)

దేవాలయంలో ఇలా చేస్తున్నారా?

దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ముందు నిలబడి నమస్కారం చేయడం.. స్తోత్రాలు చదవకూడదు. ఎడమచేతి వాటంగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థన చేయాలి. ప్రాణప్రతిష్ట చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని ప్ర

దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ముందు నిలబడి నమస్కారం చేయడం.. స్తోత్రాలు చదవకూడదు. ఎడమచేతి వాటంగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థన చేయాలి. ప్రాణప్రతిష్ట చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తి మన శరీరానికి మంచిది కాదు. అందుకే దేవాలయంలో స్వామిని దర్శించేటప్పుడు మూల విరాట్‌కు నేరుగా నిలబడకూడదు. 
 
ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది. దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్‌ను ప్రతిష్టించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు. 
 
గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం ఉంటాయి. ఆ శక్తులు మన శరీరంపై పడకుండా చూసుకోవాలి. అలాగే స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు. ఎడమవైపు లేదా కుడి వైపు నిల్చుని నమస్కరించుకోవాలి. 
 
ఇక ఆలయానికి వెళ్తే.. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఆలయంలో ఇచ్చే దైవప్రసాదాన్ని పారవేయరాదు. ఇంట్లో దీపాన్ని నోటితో ఆర్పకూడదు. ఒక దీపం వెలుగుతుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదని పండితులు చెప్తున్నారు.