గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (12:17 IST)

సూర్యాస్తమయంలో తైమాసం.. ఇంటి ముందు దీపాలు.. మగాళ్లకు మంచిది కాదట..

సంక్రాంతి పురుషుడు గేదె మీద వచ్చాడు. అందుచేత మగాళ్లకు కీడు జరుగుతుందని వదంతులు తమిళనాట వ్యాపించాయి. పురుషులకు ఇది మంచిది కాదని.. ఊరూవాడా ప్రచారం సాగింది. అంతేగాకుండా.. తమిళ మాసమైన తైమాసం ఆవిర్భావం...

సంక్రాంతి పురుషుడు గేదె మీద వచ్చాడు. అందుచేత మగాళ్లకు కీడు జరుగుతుందని వదంతులు తమిళనాట వ్యాపించాయి. పురుషులకు ఇది మంచిది కాదని.. ఊరూవాడా ప్రచారం సాగింది. అంతేగాకుండా.. తమిళ మాసమైన తైమాసం ఆవిర్భావం... ఆదివారం రోజు జరిగింది. ఈ మాసం ఆదివారం సాయంత్రం 5.09నిమిషాలకు ఉభయ లగ్నంలో సూర్యుడు అస్తమించాడు. 
 
సూర్యుడు అస్తమించే సమయంలో తైమాసం రావడంతో.. ఇళ్లల్లోని పురుషులకు ప్రమాదం పొంచి వుందని విల్లుపురం ప్రాంతంలో పెద్ద ఎత్తున వదంతులు పుట్టాయి. రెండు రోజులుగా ఈ ప్రచారం తమిళనాడు రాష్ట్రం మొత్తం పాకేసింది. దీనికి పరిహారంగా మహిళలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. 
 
తైమాసం సూర్యుడు అస్తమించే సమయానికి రావడంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వరసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున తై అమావాస్య రోజున పుణ్యస్నానాలు చేశారు. పరిహార పూజలు చేస్తున్నారు. ఇంటి ముందు దీపాలు వెలిగించారు. చెరువులు, నదుల్లో స్నానాలు చేశారు.