అలాంటి వ్యక్తి 1000 పొరపాట్లు చేస్తే ఇలాంటి వ్యక్తి 50 వేలు చేస్తాడు... స్వామి వివేకానంద

1. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్ధం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. 2. అసూయనూ, తలబిరుసును విడనాడండి. పర హితార్దమై సమిష్టిగా కృషి చేయడం అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.

swamy vivekananda
chj| Last Modified మంగళవారం, 10 జులై 2018 (22:20 IST)
1. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్ధం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.
 
2. అసూయనూ, తలబిరుసును విడనాడండి. పర హితార్దమై సమిష్టిగా కృషి చేయడం అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.
 
3. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. స్వార్థం లేశమైనా లేని వ్యక్తే పరమానందాన్ని పొందేది.
 
4. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పులు ద్వారా మనమే పరిణితిని పొందుతాము.
 
5. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి వెయ్యి పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శము లేనివాడు యాభై వేల పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది. దీనిపై మరింత చదవండి :