ఆషాఢ మాసంలో కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తే?

సోమవారం, 9 జులై 2018 (15:00 IST)

ఆషాఢ మాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసమని అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్యభగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుండే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తారు.
 
లక్షలాదిమంది పాల్గొనే ఈ యాత్ర ఎంతో విశిష్టం, పవిత్రం. ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తాయి. తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. పచమవేదంగా ఖ్యాతికెక్కిన మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని పూజించే రోజును గురుపౌర్ణమిగా నిర్వహిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి.
 
తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు. దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసమే ఈ ఆషాఢమాసం.దీనిపై మరింత చదవండి :  
ఆషాఢమాసం నక్షత్రం విష్ణువు సూర్యభగవానుడు మహంకాళి అమ్మవారు ఏకాదశి వ్యాసుభగవానుడు ఆధ్యాత్మికం కథనాలు Ashada Masam Religion Stars Mahamkali Maha Vishunuv

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఆపదనలను తొలగించే ఆదిదేవుడు....

పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ ...

news

బాబాకు వెండి కిరీటం .. దానం చేసిన బిచ్చగాడు

ఓ బిచ్చగాడు దేవుడుకి కిరీటం చేయించాడు. దాని విలువ అక్షరాలా లక్ష రూపాయలు. అవును ఏ గుడి ...

news

ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలంటే?

శని అనే పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. సాక్షాత్తు ఈశ్వరుడినే తిప్పలు పెట్టిన ...

news

కాలభైరవ స్వామి గురించి?

కాలభైరవ్‌నాథ్ దేవాలయంలో కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం పెడతారు. దేవుడికోసం మద్యాన్ని ఒక ...