తిరుమలలో టైమ్ స్లాట్ విధానం ప్రారంభం.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..? తిరుమ

tirumala
selvi| Last Updated: గురువారం, 26 ఏప్రియల్ 2018 (12:18 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..? తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రకటించినట్టుగా సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానం గురువారం ప్రారంభమైంది. 
 
దీని ప్రకారం ఓ భక్తుడు క్యూ కాంప్లెక్స్ లోపలికి ఎన్ని గంటలకు రావాలన్న విషయాన్ని ముద్రిస్తారు. అధికారులు బయోమెట్రిక్ కూపన్ అందిస్తారు. ఈ కూపన్ తీసుకుని సమయానికి క్యూలైన్ వద్దకు వెళ్తే రెండు లేదా మూడు గంటల్లోనే స్వామిని దర్శించుకుని బయటకు వచ్చే వీలుంటుంది. అయితే ఈ కూపన్ పొందాలంటే.. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ తప్పనిసరి. 
 
సర్వదర్శనానికి టైమ్ స్లాట్ ప్రయోగాత్మకంగా టీటీడీ పరిశీలించింది. భక్తుల నుంచి టైమ్ స్లాట్ విధానానికి మంచి ఆదరణ లభించడంతో.. పకడ్బందీగా ఈ విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా అధునాతన కంప్యూటర్ల సాయంతో, 100కు పైగా టైమ్ స్లాట్ కేటాయింపు కేంద్రాలను తిరుమల, తిరుపతిలలోని పలు ప్రాంతాల్లో ఎంపిక చేశారు. 
 
ప్రస్తుతం నిర్దేశిత సమయంలో టైమ్ స్లాట్‌ను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించామని, మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తితిదే అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ పొందని భక్తుల కోసం సర్వదర్శనం క్యూలైన్ తెరిచే ఉంటుందని తెలిపారు.దీనిపై మరింత చదవండి :