అంజనాద్రిపై శ్రీరామ తీర్థం, సీతా తీర్థం... హనుమంతుడు అక్కడే...

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (14:38 IST)

రామ భక్త హనుమ శ్రీనివాసుని దాసానుదాసుడు కూడా. కలియుగ వైకుంఠ వాసుని సేవించడానికి తిరుమలగిరులలో అనేకానేక పేర్లలో వెలిశాడు. ఏడుకొండల్లో ఓ కొండ.. హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమూ ఇదేనంటారు. ఆ స్థల మహత్యం తెలిసిన జాపాలి ఈ కోనలో ఘోర తపస్సు చేశాడట. 
hanuman
 
మహర్షి అంకుఠిత దీక్షకు మెచ్చిన ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం. రావణ సంహారం తరువాత... సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమనీ, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమనీ పేర్లు వచ్చాయి.
 
ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటీ ఉన్నాయి. వన్య మృగాలకు నెలవు ఈ ప్రాంతం. అందులోనూ.... ఉడుతల దండు కనువిందుచేస్తుంది. లంకకు వారధి కట్టడంలో ఉడతాభక్తిగా సేవ చేసిన ఫలం కారణంగా, ఇక్కడ నీడను ఇచ్చాడు భగవంతుడు. పాపనాశం వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది.దీనిపై మరింత చదవండి :  
Tirumala Japali Theertham Japali Anjaneya Swamy Temple

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తితిదే ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్.. ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల పందారానికి శ్రీకారం ...

news

చెద పురుగు వల్ల విష్ణుమూర్తి తల ఎగిరి ఎటో దూసుకువెళ్లింది...

శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ...

news

శ్రీవారి ఆలయంలో ఇక పరకామణి సేవలుండవా? హుండీ కానుకల లెక్కింపు ప్రైవేట్ చేతికి?

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామికి వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ...

news

శత్రువులుగా అయితే మూడు జన్మల్లోనే... మిత్రులుగా అయితే 7 జన్మలు... ఏది కావాలి?: శ్రీ మహావిష్ణు

నిర్మలంగా, ప్రశాంతంగా రోజులు, కాలం సాగుతున్నాయి. వేదాలను సంరక్షించడానికి ...