Widgets Magazine

"రంగస్థలం" మొక్కు తీర్చుకున్న చిట్టిబాబు భార్య... నేడు సక్సెస్ మీట్

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:02 IST)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త నటించిన తాజా చిత్రం రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో చెర్రీ భార్య కామినేని ఉపాసన కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు.
upasana
 
గురువారం సాయంత్రం నడకను ప్రారంభించిన ఆమె, కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆపై శుక్రవారం ఆమె వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. తితిదే సిబ్బంది ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, రెండు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు రంగస్థలం సక్సెస్ మీట్ హైదరాబాద్, యూసఫ్‌గూడలోని పోలీస్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం చిత్ర నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా పాల్గొననుంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
రంగస్థలం ఉపాసన కాలినడక తిరుమల Rangasthalam Upasana Wife Tirumala రామ్ చరణ్ Foot Walk Ram Charan

Loading comments ...

తెలుగు సినిమా

news

నానిని తొక్కేసిన అనుపమ పరమేశ్వరన్.. ఎలా?

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కు అభిమానులు ఎక్కువే. క్యూట్ లుక్ తో ప్రేక్షకులకు బాగా ...

news

ఔను... మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. శ్రీరెడ్డికి నా మద్దతు : నటి అర్చన

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి మరో నటి ...

news

యుఎస్‌లో "రంగస్థలం" జోరు : సక్సెస్‌మీట్‌లో కలవనున్న మెగాబ్రదర్స్

రామ్ చరణ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "రంగస్థలం". గత నెల 30వ తేదీన ...

news

మ‌న‌సులు గెలిచే కృష్ణార్జునులు .. నాని "కృష్ణార్జునయుద్ధం" మూవీ రివ్యూ (Video)

సాధారణంగా హీరోలకు ఒక్క సినిమా హిట్ పడిందంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటిది నేచురల్ ...

Widgets Magazine