రద్దీ బాబోయ్.. రద్దీ... తిరుమల క్యూ లైన్లకు తాళాలు

శనివారం, 12 ఆగస్టు 2017 (12:27 IST)

devotees crowd

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ రద్దీని నివారించడం తితిదే అధికారులకు సాధ్యపడటం లేదు. ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. రద్దీని క్రమబద్ధీకరించడం అసాధ్యంగా మారుతోంది. దీంతో క్యూలైన్లకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నాలుగు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తొలి రోజే తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఉదయం 8 గంటల సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్టుమెంట్లూ నిండిపోగా, ఆపై గంట వ్యవధిలోనే భక్తుల క్యూ లైన్ 2 కిలోమీటర్లకు పైగా పెరిగిపోయింది. దీంతో భక్తుల రద్దీని తట్టుకోవడం క్లిష్టతరం కావడంతో టీటీడీ సిబ్బంది క్యూ లైన్లకు తాళాలు వేశారు. 
 
మరోవైపు వేలాది మంది తాళాలు వేసిన ప్రాంతాల్లో తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ఇంకోవైపు కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే నేటి 20 వేల టికెట్ల కోటా కూడా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మరోపక్క వర్షం కూడా పడుతూ ఉండటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లతో పాటు పలు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. ఈ రద్దీ మంగళవారం వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

గన్నేరు, గరికతో వినాయకుడిని పూజిస్తే? గరికను బీరువాలో ఉంచితే?

ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని స్తుతించడం ఆనవాయితీ. సమస్త ...

news

ధర్మరాజు మనువడనే విషయాన్ని మరిచిన పరీక్షిత్తు.. ఎలా మరణించాడంటే?

ధర్మరాజు మనుమడు అనే విషయాన్ని పరీక్షిత్తు మహారాజు మరిచిపోయి.. చెయ్యరాని పని చేయడం ద్వారా ...

news

శ్రీవారికి తేలికైన సర్వభూపాలవాహనం.. 16 అడుగుల ఎత్తు.. 9 కిలోల బంగారంతో?

కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ...

news

7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? ...