శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (18:36 IST)

ధోనీని వీడని యాడ్ గొడవ: కూల్ కెప్టెన్‌కు అనంత కోర్టు సమన్లు!

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని యాడ్ బెడద వదిలేలా లేదు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన మ్యాగజైన్‌లో ధోనీ వేషధారణ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని వీహెచ్‌పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అనంతపురం కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ మేరకు నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని అనంతపురం కోర్టు ఆదేశించింది.
 
కాగా.. బిజినెస్ టుడే పత్రిక కవర్ పేజీపై విష్ణురూపంలో తన ఫోటోను ప్రచురించిన వివాదంపై జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2013కు సంబంధించిన ఈ కేసులో ధోనీకి సుప్రీంలో ఊరట లభించింది. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ధోనీపై నమోదైన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధించింది.
 
ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే విష్ణువు రూపంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించింది. హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.