Widgets Magazine

సెర్బియా చెస్ క్రీడాకారిణితో పెండేల హరికృష్ణ పెళ్లి

భారత చెస్ క్రీడాకారుడు పెండేల హరికృష్ణ.. సెర్బియా చెస్ క్రీడాకారిణిని వివాహం చేసుకోబోతున్నాడు. సెర్బియా క్రీడాకారిణి నదెడ్జాను తాను వివాహం చేసుకోనున్నట్లు హరికృష్ణ మీడియాకు తెలిపాడు. గ్రాండ్ మాస్టర్ అ

selvi| Last Updated: సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (12:59 IST)
భారత చెస్ క్రీడాకారుడు పెండేల హరికృష్ణ.. సెర్బియా చెస్ క్రీడాకారిణిని వివాహం చేసుకోబోతున్నాడు. సెర్బియా క్రీడాకారిణి నదెడ్జాను తాను వివాహం చేసుకోనున్నట్లు మీడియాకు తెలిపాడు. గ్రాండ్ మాస్టర్ అయిన పెండేల హరికృష్ణ-
నదెడ్జాల వివాహం మార్చి 3వ తేదీన హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరుగనుంది.

ఈ సందర్భంగా తనకు కాబోయే సతీమణి నదెడ్జా ఫోటోను కూడా హరికృష్ణ మీడియా ముందు విడుదల చేశాడు. ఇంకా ఆహ్వాన పత్రికను కూడా మీడియాకు విడుదల చేశారు. అంతేగాకుండా పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికను వీడియో రూపంలో హరికృష్ణ తెలిపారు. మార్చి మూడో తేదీ రాత్రి 08.07 గంటలకు వీరి వివాహం జరుగనుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దీనిపై మరింత చదవండి :