శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (10:51 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియాకు చుక్కెదురు!

ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ తొలి రౌండ్లో విజయం సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రెండో రౌండ్లో పరాభవం తప్పలేదు. రెండో సీడ్ గా బరిలోకి దిగిన సానియా మీర్జా - సూ వీ జంట రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. 
 
అన్ సీడెడ్ జోడీ అయిన డబ్రౌస్కీ - రొసోల్స్ కా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 6-7, 4-6 వరుస సెట్లలో సానియా జోడీని డబ్రౌస్కీ జోడీ కంగుతినిపించింది. అన్ సీడెడ్ జంట చేతిలో ఓటమి పాలవడంతో సానియా జోడీ షాక్‌కు గురైంది.