శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (15:49 IST)

కామన్వెల్త్‌ లిఫ్టర్ తౌవా ఉదియాపై లైంగిక దాడి కేసు!

కామన్వెల్త్ క్రీడల సందర్భంగా పపువా న్యూగినియాకు చెందిన తౌవా ఉదియా (22) అనే లిఫ్టర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ క్రీడలకు వేదికైన గ్లాస్గో నగరంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద ఈ లిఫ్టర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దీనిపై గ్లాస్గో షెరిఫ్ కోర్టులో విచారణ జరుగుతోంది. 
 
విచారణ సందర్భంగా తౌవా తనపై ఆరోపణలను అంగీకరించలేదని, తదుపరి విచారణ శుక్రవారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. సోమవారం ఈ ఘటన జరిగిందని ఫిర్యాదు మేరకు లిఫ్టర్‌ను అరెస్ట్ చేశామన్నారు. అయితే "మార్కెట్ వద్ద సంఘటన యాధృచ్చికంగా జరిగింది. నా ప్రతిష్ఠకు భంగం కలగాలని కోరుకోను" అని తౌవా పేర్కొన్నట్టు ఆస్ట్రేలియా ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా తెలిపింది.