శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 జులై 2014 (13:16 IST)

కామన్వెల్త్ క్రీడలకు సచిన్ : వామ్మో.. అంటోన్న పీవీ సింధు!

కామన్వెల్త్ క్రీడల సందర్భంగా సచిన్ బ్రిటన్ ఉన్నాడు. సచిన్ కామన్వెల్త్ గేమ్స్‌ కోసం బ్రిటన్‌లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు టెన్షన్ పడుతోంది. ఎందుకంటే.. పీవీ సింధు, భారత అభిమానుల ఆశలనే కాదు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంచనాలనూ అందుకోవాల్సి ఉంటుందండో ఉండటమే ఇందుకు కారణం. 
 
ఎలాగంటారా... 2012లో సింధు జూనియర్ ఏషియన్ చాంపియన్ షిప్ నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. ఆ ఘనతను అభినందిస్తూ సచిన్ ఆమెకో కారు బహూకరించాడు. భవిష్యత్తులో ఇలాంటివే మరిన్ని విజయాలు అందుకోవాలని సచిన్ ఆ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
 
ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల సందర్భంగా సచిన్ బ్రిటన్లోనే ఉన్నాడు. ముఖ్యంగా ఈ బ్యాటింగ్ దేవుడు సింధు ఆడే మ్యాచ్ లపై ఆసక్తి కనబరుస్తుండడం ఆమెను ఒత్తిడిలోకి నెడుతుందని క్రీడా పండితులంటున్నారు. మరి సింధు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.