శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2014 (16:19 IST)

డబ్బు ముఖ్యం కాదు.. పని చేయడం ప్రధానం : ప్రియాంక చోప్రా

తనకు డబ్బు ముఖ్యం కాదని, అనుకున్న పనిని పూర్తి చేయడమే ప్రధానమని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఆమె ప్రముఖ మహిళా బాక్సర్ మేరీకోం పాత్ర ఆధారంగా తీస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆమె మాట్లాడుతూ.. తనకు డబ్బు ముఖ్యం కాదని, మంచి పని ముఖ్యమన్నారు. బాక్సర్ మేరీకోం పాత్రలో నటిస్తున్న ప్రియాంకా ఆ సినిమా తాను ఉచితంగానే చేసేదాన్నని అన్నారు. తనకు ప్రతి సినిమా ఒక ‘మొగల్ ఎ అజమ్’ వంటిదన్నారు. మేరీకోం జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా సెప్టెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. 
 
ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రియాంకా మాట్లాడుతూ... ప్రతి చిత్రంలోనూ తాను పోషించే పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడతానని చెప్పారు. తనకూ మేరీకోంకు పోలికలున్నాయన్న ఆమె... పెంపకంలో, పురుష ప్రధాన వృత్తుల్లో మహిళలుగా జీవితాన్ని ఎదుర్కొన్న తీరులో పోలికలున్నాయన్నారు.