శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (09:35 IST)

కామన్వెల్త్ క్రీడలు 2018 : భారత్ బోణి...

ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2018లో భారత్ బోణీ చేసింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించారు. మొత్తం

ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2018లో భారత్ బోణీ చేసింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించారు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచారు. 
 
మలేసియా వెయిట్ లిఫ్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ 261 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకం సాధించగా, శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించారు. కాగా, కోస్టల్ కర్ణాటకలోని కుందపురకు చెందిన గురురాజా తొలుత రెజ్లర్‌గా కెరీర్ ప్రారంభించి పవర్ లిఫ్టింగ్‌కు, ఆ తర్వాత వెయిట్‍లిఫ్టింగ్‌కు మారారు. ఇపుడు రజతపతకంతో చరిత్ర సృష్టించాడు.