శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:25 IST)

బి శాంపిల్ పాజిటివ్‌గా తేలింది: గీతారాణి డోపింగ్ దొంగ!

భారత వెయిట్ లిఫ్టింగ్‌కు మరోసారి డోపింగ్ బురద అంటింది. కామన్వెల్త్‌ పసిడి పతక విజేతగీతారాణి డోపింగ్‌ దొంగగా తేలింది. ఆమె నుంచి సేకరించిన ‘బి’ శాంపిల్‌ పాజిటివ్‌గా తేలడంతో.. దీర్ఘకాల నిషేధం వేటుపడే అవకాశం ఉంది. దీంతో ఆమె కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 2006 కామన్వెల్త్‌ క్రీడల్లో గీతారాణి బంగారు పతకాన్ని, 2004 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మూడు రజతాలను కైవసం చేసుకుంది.
 
జాతీయ క్రీడల సందర్భంగా గీతారాణి నుంచి సేకరించిన ‘ఎ’ శాంపిల్‌లో నిషేధిక ఉత్ర్పేరకాలు వాడినట్లు బయటపడడంతో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. దీంతో పాటు గత నెలలో జరిగిన ఆలిండియా పోలీస్‌ మీట్‌ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన ‘బి’ శాంపిల్‌ కూడా పాజిటివ్‌గా తేలింది. 
 
గీతారాణి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) ప్యానల్‌ నిర్ణయిస్తుంద’ని భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం ఉపాధ్యక్షుడు సచ్‌దేవ్‌ చెప్పాడు. అంతర్జాతీయ డోపింగ్‌ నిబంధనల ప్రకారం 12 నెలల కాలంలో రెండు లేక అంతకంటే ఎక్కువ సార్లు డోపింగ్‌లో పట్టుబడితే ఎనిమిదేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది.