శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:27 IST)

కామన్వెల్త్ 2018 : గురి కుదిరింది.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా సాగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణపతకం చేరింది. షూటింగ్‌ విభాగంలో ఈ పతకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ కామన్వె

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా సాగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణపతకం చేరింది. షూటింగ్‌ విభాగంలో ఈ పతకం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయాడు. ఇదే ఈవెంట్‌లో ఓంప్రకాశ్ మిథర్వాల్‌కు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఫైనల్లో 235.1 పాయింట్లతో గేమ్స్ రికార్డును జీతూ రాయ్ తిరగరాశాడు. 
 
ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ బెల్ 233.5 పాయింట్లతో సిల్వర్, ఓంప్రకాశ్ 214.3 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జీతూ రాయ్ సాధించిన గోల్డ్‌తో భార‌త స్వ‌ర్ణ‌ప‌త‌కాల సంఖ్య 8కి చేరింది. దీంతో కెన‌డాను వెన‌క్కి నెట్టి ప‌త‌కాల ప‌ట్టిక‌లో మూడోస్థానానికి దూసుకెళ్లింది. ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో మొత్తం 17 ప‌త‌కాలు ఉన్నాయి. 
 
మరోవైపు మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత్‌కు చెందిన మెహులి ఘోష్ సిల్వర్ మెడల్ గెలిచింది. అపూర్వి చండేలా కాంస్యంతో సరిపెట్టుకుంది.