శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (13:08 IST)

లియోనల్ మెస్సీ మరో రికార్డు: 71 గోల్స్‌తో అదుర్స్!

అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అదుర్స్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ లీగ్ పోటీలలో రౌల్ పేరిట ఉన్న 71 గోల్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతటి గొప్ప రికార్డుకు చేరుకోవడం తనకెంతో హ్యాపీగా ఉందని మెస్సీ వ్యాఖ్యానించాడు. 
 
అయితే, మ్యాచ్‌లను గెలిపించే గోల్స్ చేసినప్పుడు మరింత ఆనందంగా ఉంటుందని మెస్సీ చెప్పుకొచ్చాడు. మంగళవారం రాత్రి బార్సిలోనాపై మెస్సీ టీం తలపడగా, ఈ మ్యాచ్‌లో తన అద్భుత మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ, మెస్సీ మూడు గోల్స్ చేసి జట్టుకు విజయం సాధించి పెట్టాడు.