శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (17:25 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌: భూపతి జోడీ అవుట్

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మహేష్ భూపతి జోడీ పోరు ముగిసింది. డబుల్స్ తొలి రౌండ్లోనే భూపతి జోడీ నిష్క్రమించింది. ఈ విభాగంలో మహేశ్, ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి జర్మిలా గడసోవా భాగస్వామ్యం... చైనీస్ తైపీ జంట హ్యోచింగ్ ఛాన్, బ్రిజ్ జమైముర్రేలతో తలపడింది.
 
ఈ రెండు జోడీల మధ్య జరిగిన ఆటలో భూపతి జోడీ మొదట్లో గట్టిపోటీ ఇచ్చి తొలి సెట్‌ను 29 నిమిషాల్లో సొంతం చేసుకుంది. దాంతో రెండో సెట్‌లో చైనీస్ తైపీ జంట బలపడి పుంజుకోవడంతో భూపతి, గడసోవాలు వెనుదిరగాల్సి వచ్చింది. ఫలితంగా 6-4, 6-7 97) (8-10) తేడాతో భూపతి జోడీ ఓటమి పాలైంది.