శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:58 IST)

ప్రపంచ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్‌లో పంకజ్ అద్వానీ టైటిల్

భారత బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో పంకజ్ 1928 - 893తో ఇంగ్లాండ్‌కు చెందిన వరల్డ్ మూడో ర్యాంకర్ రాబర్ట్ హాల్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
 
ఆట మొదలైన తొలి గంటలో 185 బ్రేక్ పాయింట్లు సాధించిన పంకజ్ ఆ తర్వాత కూడా హవా కొనసాగించాడు. తొలి సెషన్ ముగిసేసరికి పంకజ్ 746 - 485 ఆధిక్యంలో నిలిచాడు. రెండో సెషన్‌లో కూడా పంకజ్ 94, 182, 289, 145 బ్రేక్ పాయింట్లతో గెలుపు దిశగా పయనించాడు.
 
చివరి గంటలో కూడా పంకజ్ 94, 93, 59, 58, 62, 90 బ్రేక్ పాయింట్లను సాధించాడు. మొత్తానికి ఐదు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పంకజ్ పూర్తి హవా ప్రదర్శించాడు. చివరికి పెయ్యికిపైగా పాయింట్ల తేడాతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.