శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (17:10 IST)

'నా జ్ఞాపికలను తిరిగివ్వండి': బల్బీర్ సింగ్

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మ్యూజియం కట్టి అందులో జ్ఞాపికలను భద్రపరుస్తామంటూ దాదాపు 30 ఏళ్ల కిందట హాకీ దిగ్గజం, ట్రిపుల్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియుర్ నుంచి అప్పటి అధికారులు ఒలింపిక్ బ్లేజర్, కొన్ని పతకాలు, అరుదైన ఫోటోలను తీసుకున్నారు. 
 
అయితే లండన్ ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన ఎగ్జిబిషన్ కోసం మెల్‌బోర్న్ గేమ్స్ బ్లేజర్ ఇవ్వాల్సిందిగా బల్బీర్‌ను అంతర్జాతీయు ఒలింపిక్ కమిటీ అధికారులు కోరారు. కానీ ‘సాయ్’ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బల్బీర్ బ్లేజర్‌ను ఇవ్వలేకపోయూరు. 
 
ఇక అంతర్జాతీయుంగా తాను సాధించిన వెలకట్టలేని జ్ఞాపికల గురించి రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ వాళ్లు మాత్రం స్పందించలేదు.