శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:34 IST)

రియో ఒలింపిక్స్‌లో ఓటమి.. కంటతడిపెట్టిన సానియా మీర్జా.. మళ్లీ ఆడతానో లేదో..

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా జోడీకి చుక్కెదురైంది. వచ్చిన అవకాశం చేజారిపోవడంతో సానియా-రోహన్ బోపన్న జోడీలకు తీవ్ర నిరాశే ఎదురైంది. మ్యాచ్ కోల్పోయిన అనంతరం సానియా జోడీ మాట

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా జోడీకి చుక్కెదురైంది. వచ్చిన అవకాశం చేజారిపోవడంతో సానియా-రోహన్ బోపన్న జోడీలకు తీవ్ర నిరాశే ఎదురైంది. మ్యాచ్ కోల్పోయిన అనంతరం సానియా జోడీ మాట్లాడుతూ.. "నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తాయి. మళ్లీ ఆడతానో లేదో. మాటలు రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. కానీ అంగీకరించక తప్పని పరిస్థితి ఇది'' అంటూ ఉబికి వస్తున్న కన్నీటి ఆపుకుంటూ మాట్లాడింది.
 
రియో ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం.. ఈ రోజు ఆట 2004లో పేస్-భూపతిల 2004నాటి ఏథెన్స్ ఒలింపిక్స్ మ్యాచ్‌ను గుర్తు చేసిందంటూ సానియా చెప్పుకొచ్చింది. ఇంకా సానియా మాట్లాడుతూ.. టెన్నిస్ ప్లేయర్లకు అదృష్టం కలిసి రావాలి. దీన్నుంచి బయటపడటానికి కాస్త సమయం పడుతుంది. అయినా మేము త్వరలో జరగబోయే డబ్ల్యూటీఏ పోరుకు సిద్ధమవుతామని సానియా చెప్పుకొచ్చింది.