శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (18:56 IST)

సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం: పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్ ద్వారా బలపరీక్ష

హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనా నెహ్వాల్‌కు సభ్యత్వం కల్పించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్

హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనా నెహ్వాల్‌కు సభ్యత్వం కల్పించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బచ్ స్పష్టం చేశారు. ఏంజిలో రుగీరో అధ్యక్షతను ఈ కమిటీ ఎన్నికైంది. ఈ కమిటీలో 9 మంది ఉపాధ్యక్షులు, పది మంది సభ్యులు ఉంటారు. వీరి మొదటి సమావేశం నవంబర్ 6వ తేదిన జరగనుంది.
 
గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన సైనా.. మోకాలి శస్త్రచికిత్స అనంతరం ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సైనా నియామకంపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య సభ్యులు, ఆమె తండ్రి హర్‌వీర్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.
 
ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన పీవీ సింధు దాదాపు రెండు నెలల విరామం తరువాత మళ్లీ రాకెట్ పట్టింది. డెన్మార్క్ ఓపెన్‌లో సిందూ ఐదో సీడ్‌గా బరిలోకి దిగింది. చైనా క్రీడాకారిణులతో తలపడనున్న పీవీ సింధుకు ఇది బలపరీక్ష కానుందని క్రీడా పండితులు అంటున్నారు.