Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మకావు ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్.. దివాకు చుక్కలు..

గురువారం, 1 డిశెంబరు 2016 (12:54 IST)

Widgets Magazine

మకావు ఓపెన్‌ గ్రాండ్‌ప్రిలో భారత స్టార్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. ఇండోనేషియా క్రీడాకారిణి దివా అయుస్తిన్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న సైనా రెండో సెట్‌లో పుంజుకుంది. దీంతో హోరాహోరిగా జరిగిన రెండో సెట్‌ను సైనా 21-18తో గెలుచుకుంది.

నిర్ణయాత్మక మూడో సెట్‌లో సైనాకు ప్రత్యర్థి దివా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా మూడో సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ 17-21, 21-18, 21-12తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
 
ఇదిలా ఉంటే.. హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో హాంకాంగ్ చెంగ్ యు చేతిలో 8-21, 18-21, 19-21తో సైనా నెహ్వాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే మకావు ఓపెన్‌లో సైనా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Saina Nehwal P Kashyap B Sai Praneeth Reach Pre-quarters At Macau Open

Loading comments ...

ఇతర క్రీడలు

news

మకావు ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్-సైనా నెహ్వాల్ ఇన్.. దుబాయ్ సిరీస్‌ కోసమే..

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలవడంతో పాటు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా ...

news

హాంకాంగ్ సూపర్ సిరీస్.. రన్నరప్‌గా నిలిచిన పీవీ సింధు.. తప్పిదాలతో టైటిల్ అవుట్

హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. ...

news

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో ...

news

అబ్బా గుత్తా... అదరగొట్టిందోయబ్బా...(ఫోటో)

గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ ఆటతో పాటు ఫ్యాషన్ ట్రెండ్సును కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ...

Widgets Magazine