శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (10:54 IST)

సైనా నెహ్వాల్: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో శుభారంభం!

భారత సూపర్ షట్లర్ సైనా నెహ్వాల్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో చైనా స్టార్ షిజియాన్ వాంగ్‌ను మట్టికరిపించింది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సైనా 21-17, 21-18తో వాంగ్‌ను చిత్తు చేసింది.
 
రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ వాంగ్ ఈ పోరులో సైనా ధాటికి నిలవలేకపోయింది. మాజీ వరల్డ్ నెంబర్ వన్ వాంగ్ గత ఐదు మ్యాచ్ లలో నాలుగు సార్లు సైనాపై నెగ్గింది. అయితే, గత రికార్డును పట్టించుకోని సైనా సామర్థ్యం మేరకు ఆడి చైనా క్రీడాకారిణికి షాకిచ్చింది.