శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (16:58 IST)

సరితా దేవి సారీ.. సస్పెన్షన్ ఎత్తివేయాలని బాక్సింగ్ ఇండియా వినతి!

సరితా దేవికి బాక్సింగ్ ఇండియా వత్తాసు పలికింది. భారత దేశ బాక్సర్ సరితాదేవిపై  విధించిన ప్రొవిజనల్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బాక్సింగ్ ఇండియా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి విజ్ఞప్తి చేసింది. 
 
సరితా దేవి బేషరతుగా క్షమాపణ చెప్పిందని, కఠిన క్రమశిక్షణకు గతంలో కట్టుబడిన చరిత్ర ఆమెకు ఉందని చెబుతూ వాటిని దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్ ఎత్తేయాలని కోరినట్లు బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా చెప్పారు.
 
ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో వివాదాస్పదమైన సెమీ ఫైనల్ ఓటమికి తీవ్ర మనస్తాపానికి గురైన సరితా దేవి కాంస్య పతకాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. ఈ సస్పెన్షన్‌తో కొరియాలోని జెజూ ఐలాండ్‌లో నవంబర్ 19 నుంచి జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆమె పాల్గొనడంపై అనుమానాలు తలెత్తాయి.