శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (00:05 IST)

ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్ సెరీనా విలియమ్స్

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ విజయం సాధించి ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని విజయ దరహాసం చేసింది. ఇది సెరీనా విలియమ్స్‌కి 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. కాగా ఈ ఫైనల్లో సెరీనా విలియమ్స్, షరపోవాల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా సాగుగా సెరీనా షరపోవా పైన 6-3, 7-6 (7-5) స్కోరుతో విజయం సాధించింది.
 
ఫలితంగా సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించిన సెరెనా విలియమ్స్ ఆరవ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో సెరీనా విలియమ్స్ 19వ గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకున్నట్లయింది.