శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (11:05 IST)

యూఎస్ ఓపెన్ నుంచి షరపోవా అవుట్: సెరెనాకు గట్టిపోటీ లేనట్లే!

యూఎస్ ఓపెన్ నుంచి రష్యా భామ మరియా షరపోవా తప్పుకోవాల్సి రావడంతో కెరీర్ గ్రాండ్ స్లామ్‌పై కన్నేసిన సెరెనా విలియమ్స్‌కు గట్టి ప్రత్యర్థి లేకుండా పోయింది. మూడో సీడ్‌ షరపోవా వైదొలిగిన విషయాన్ని టోర్నీ డైరెక్టర్‌ డేవిడ్‌ బ్రీవర్‌ ప్రకటించాడు. అయితే మరియా నిష్క్రమణతో క్వాలిఫయింగ్‌లో ఓడిన రష్యా క్రీడాకారిణి డారియా కాసట్‌కినాను అదృష్టం వరించింది. 
 
ప్రపంచ నెం:3 స్థానాన్ని డారియాతో భర్తీ చేయడంతో అమ్మడు చాలా హ్యాపీగా ఉంది. ఇక మోకాలి గాయంతో బాధపడుతున్న షరపోవా.. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో బరిలోకి దిగడం లేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. కోలుకోవడానికి కానీ సమయం సరిపోలేదని రాసింది.
 
ఇదిలా ఉంటే.. యూఎస్‌ ఓపెన్‌ తొలిరోజే సంచలనం నమోదైంది. టోర్నీ ఆరంభ రౌండ్‌లోనే గత ఏడాది పురుషుల విభాగం రన్నరప్‌ నిషికొరి, టాప్‌ సీడ్‌ సెర్బియా భామ అనా ఇవనోవిచ్‌ ఇంటిదారి పట్టారు. ఏడో సీడ్‌ ఇవనోవిచ్‌కు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి డొమినిక్‌ సిబుల్కోవా (స్లొవాకియా) షాకిచ్చింది. 
 
పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో నాలుగో ర్యాంక్‌ ఆటగాడు నిషికొరి (జపాన్‌) 4-6, 6-3, 6-4, 6-7, 4-6తో పైర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-4, 6-2, 6-4తో ఎబ్డెన్‌ (ఆసే్ట్రలియా)పై అలవోకగా నెగ్గి తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాడు.