చిన్న పురుగును చూసి వణికిపోయిన టెన్నిస్ క్రీడాకారిణి... వీడియో వైరల్

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (11:43 IST)

Sloane Stephens

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో మహిళా సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి, కెరీర్‌లో మొద‌టి గ్రాండ్‌స్లామ్ సాధించిన అమెరిక‌న్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్‌ ఓ చిన్న పురుగుకు వణికిపోయింది. దీనికి సంబంధించిన ఓ ఫ‌న్నీ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత ఆమె విలేకరుల సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో ఓ చిన్న పురుగు ఆమె వైపుకు వచ్చింది. దీన్ని చూసి ఆమె భ‌య‌ప‌డిపోయింది. పైగా, ఆమె ఇచ్చిన హావ‌భావాలు అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తున్నాయి. ఆ పురుగు నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆమె మీడియా ముందే కుర్చీ నుంచి కింద‌కి వెళ్లడం, చివ‌రికి త‌న కాలి బూటుతో పురుగును చంప‌డం ఈ వీడియోలో చూడొచ్చు. 
 
ఈ పురుగును చంపిన తర్వాత ఆమె స్పందిస్తూ.. 'ఆ పురుగు నాకు డ్రాగ‌న్‌లా క‌నిపించింది. చాలా అసహ్యంగా ఉంది' అని వ్యాఖ్యానిస్తూ తన మీడియా స‌మావేశాన్ని కొన‌సాగించింది. కాగా, ఆమె చర్యపై నెటిజ‌న్లు వివిధ ఛ‌లోక్తులు విసురుతున్నారు. 'వేగంగా టెన్నిస్ బంతిని అడ్డుకునే నువ్వు... చిన్న పురుగుకు భ‌య‌ప‌డ‌తావా?', 'దానికి నీ ఆట న‌చ్చింది. అందుకే నీ ప్రెస్‌మీట్‌లో ఎగ‌ర‌డానికి వ‌చ్చింది' అంటూ హాస్యాన్ని పండించారు. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఫెడెక్స్‌పై నీళ్లు చల్లిన అర్జెంటీనా స్టార్ అటగాడు...

అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో సంచలనం సృష్టించాడు. ఏకంగా ...

news

సంప్రదాయ దుస్తులతో రెజ్లింగ్ రింగ్‌లోకి.. కవితపై ప్రశంసలు (Video)

భారతీయ మల్లయుద్ధ యోధురాలు కవితా దేవి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె... డబ్ల్యూ‌డబ్ల్యూఈ ...

news

#IHATEMYTEACHER : ఐ హేట్ మై టీచర్ అంటున్న పీవీ సింధు (Video)

భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు నిర్మాతగా మారిపోయారు. ప్రతియేటా సెప్టెంబరు ఐదో తేదీన ...

news

సైనా నెహ్వాల్ మళ్లీ గురువుకు చేరువైంది.. గోపిచంద్ అకాడమీలో మళ్లీ ట్రైనింగ్

ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా ఆడకపోవడం ద్వారా ...