Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రింగ్‌లో డ్రాగన్ కోరలు పీకేసిన విజేందర్ : ఇండో-చైనా బోర్డర్‌లో శాంతి నెలకొల్పాలని పిలుపు

ఆదివారం, 6 ఆగస్టు 2017 (11:53 IST)

Widgets Magazine

భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ్రాగన్ కోరలు పీకేశాడు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ఓడించి విజేతగా నిలిచాడు. 96-93, 95-94, 95-94 తేడాతో జుల్ఫికర్‌ను ఓడించి భారత సత్తాను మరోసారి చాటాడు. వరుసగా తొమ్మిదో సారి విజయం సాధించి తానే బాక్సింగ్ చాంపియన్‌ను అని మరోసారి చాటుకున్నాడు.
Vijender Singh
 
ఈ ఫైట్‌లో తొలి ఐదు రౌండ్లలో ఆధిపత్యం ఉన్నా ఆ తర్వాత రెండు రౌండ్లలో విజేందర్ డీలా పడ్డాడు. కానీ చివరిదాకా పోరాడి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా డబ్ల్యూటీవో ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో చైనా సరిహద్దు గోడలను బద్ధలు కొట్టినంతపని చేశాడు. 
 
ఇండో-చైనా బోర్డర్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో బౌట్‌కు మంచి ప్రాచుర్యం లభించింది. చైనా బాక్సర్‌పై విజేందర్‌ కసిగా పంచ్‌ల వర్షం కురిపిస్తుంటే.. సంబరాలు చేసుకోవాలని ప్రతి భారతీయుడూ హర్షించాడు. కానీ విజేందర్‌ (32) కంటే 9 ఏళ్లు చిన్నవాడైన జుల్పికర్‌.. రింగ్‌లో మాత్రం గట్టిపోటీ ఇచ్చాడు. 10 రౌండ్ల పోరులో సింగ్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసినట్టు కనిపించినా.. ఫౌల్స్‌ కారణంగా మూల్యం చెల్లించుకున్నాడు. 
 
ఈ విజయం తర్వాత విజేందర్ స్పందిస్తూ.. ఇండో-చైనా బోర్డర్‌లో ఉద్రిక్తతను తగ్గించి.. శాంతిని నెలకొల్పండి. జుల్పికర్‌ ఓడిన డబ్ల్యూబీఓ ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ బెల్ట్‌ను అతడికే తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నా. చైనా ఉత్పత్తులు ఎక్కువ కాలం నిలబడవనుకున్నా. కానీ జుల్పికర్‌ పోరాడిన తీరు ఆశ్చర్యపరిచింది. 5-6 రౌండ్లలో పోరు ముగుస్తుందనుకున్నా. నా వ్యూహానికి తగ్గట్టు ఆడలేదు. బెల్ట్‌ కింద తగలడంతో ఇబ్బంది పడినట్టు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

విజేందర్‌కు చైనా జుల్ఫికర్ ప్రతి సవాల్.. ఇంటికొస్తాడట.. బెల్టులు తీసుకెళ్తాడట!?

భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల ...

news

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ ఆపుకోలేకపోయాడు... ఏం చేశాడో తెలుసా?

క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ...

news

డోప్ పరీక్షలో పట్టుబడిన భారతీయ అథ్లెట్ ... స్వర్ణం వెనుకకు?

భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీంతో భువనేశ్వర్ వేదికగా ...

news

చరిత్ర సృష్టించిన ఫెదరర్... ఖాతాలో 19 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్

స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డెన్ ...

Widgets Magazine